కార్పొరేట్ మహిళా శక్తిని చూసి మురిసిపోయిన కల్వకుంట్ల కవిత

  • హైదరాబాద్ లో మహిళా సదస్సు
  • తెలంగాణ జాగృతి, గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా ఆధ్వర్యంలో సదస్సు
  • సదస్సుకు హాజరైన కవిత
తెలంగాణ జాగృతి భాగస్వామ్యంతో హైదరాబాద్ లో గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా (ఐరాస అనుబంధ సంస్థ) ఓ మహిళా సదస్సు నిర్వహించింది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. 'డెవలపింగ్ ఉమెన్ లీడర్ షిప్: ఎ రోడ్ మ్యాప్ టు సక్సెస్' పేరిట జరుగుతున్న ఈ సదస్సులో కవిత ప్రసంగించారు. దీనిగురించి ఆమె ట్వీట్ చేస్తూ, ఒకే వేదికపై అనేకమంది శక్తిమంతమైన మహిళలను చూడడం సంతోషంగా ఉందన్నారు. తమ కెరీర్లను విజయవంతం చేసుకునేందుకు కార్పొరేట్ ప్రపంచానికి చెందిన ఎంతోమంది మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుండడం హర్షణీయం అని పేర్కొన్నారు.
Go Back to Shorts
K Kavitha
Telangana
TRS
Hyderabad
Telangana Jagruthi

More Telugu News